etela rajender chandrababu naidu ys vijayamma telangana assembly ఈటెల రాజేందర్ చంద్రబాబు నాయుడు వైయస్ విజయమ్మ తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణకు టిడిపి ఓకే, విజయమ్మా చెప్పారు: ఈటెల

తెలంగాణ తెచ్చేది ఇచ్చేది మేమే అన్న కాంగ్రెసు పార్టీ ఇప్పుడు ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ వెంటనే తెలంగాణ అంశంపై తేల్చాలన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా గతంలో తెలంగాణ విషయంలో యు టర్న్ తీసుకుందని, ఇప్పుడు ఆ పార్టీ అనుకూలంగా ఉందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూడా ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికల సమయంలో తాము తెలంగాణ ప్రజల హృదయాలలో ఏముందో గుర్తించామని, వారి మనోభావాలను గౌరవిస్తామని చెప్పారని గుర్తు చేశారు.
తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెడితే ఐదు నిమిషాలలో పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత ఇతర ప్రజా సమస్యలపై చర్చించవచ్చునని తెలిపారు. తెలంగాణపై జాప్యం సరికాదని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి, వీగిపోతె అప్పుడు కేంద్రంపై భారం వేయవచ్చునని ఆయన అన్నారు.
తెలంగాణపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పాలని అన్నారు. తెలంగాణపై తీర్మానం పెడితే వీగిపోతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం సరికాదని భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ అన్నారు.