మేం చేసిందే కనుక తప్పయితే..: జగన్ కేసుపై కన్నా

సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసే విషయమై తాము చర్చించామని చెప్పారు. త్వరలో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అంతా బిజినెస్ రూల్స్ ప్రకారమే వ్యవహరించామని చెప్పారు. మా నిర్ణయాలు కనుక తప్పయింతే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పని చేసిన మంత్రులంతా జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
బిజినెస్ రూల్స్ ప్రకారం వ్యవహరించినప్పటికీ తప్పని తేలితే ఇక భవిష్యత్తులో ఎవరు కూడా మంత్రి పదవి చేపట్టేందుకు ముందుకు రారన్నారు. కౌంటర్ దాఖలు చేసే విషయమై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో చర్చించామని కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. న్యాయసలహాలు తీసుకున్న తర్వాత ముందడుగు వేస్తామని ఆయన తెలిపారు.
కాగా మంత్రులు నలుగురు దాదాపు రెండు గంటల పాటు గీతా రెడ్డి చాంబర్‌లో భేటీ అయి చర్చించారు. మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. అసెంబ్లీలో విపక్షాల దాడిని, మిగతా ఇద్దరు మంత్రులలాగే తమపై కూడా ఛార్జీషీట్ దాఖలు చేస్తే ఏం చేయాలనే అంశంపై వారు చర్చించారు.












Click it and Unblock the Notifications