కుర్చీలు, రాళ్లు విసిరి..: కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

ఇక్కడ గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ రోజు అది తీవ్రరూపం దాల్చింది. ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకొని సమావేశ ప్రాంగణంలో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. గొడవ జరుగుతున్న సమయంలో పోలీసులు లేక పోవడంతో అది ఉద్రిక్తతకు దారి తీసింది. దాదాపు పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో సమావేశ మందిరం నుండి అందరూ బయటకు పరుగెత్తారు. జిల్లా, మండల స్థాయిలలో కమిటీలను ప్రకటించక పోవడం వల్ల ఆధిపత్య పోరు రగిలిందని చెబుతున్నారు. జిల్లా అధ్యక్షుడి పర్యవేక్షణలో సమావేశం జరిగినప్పటికీ రసాభాసగా మారింది. కాగా జిల్లా పార్టీలోని వర్గ విభేదాలు టిడిపికి నష్టం చేస్తున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications