వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ప్రకటనల్లో సోనియా గాంధీ ఫోటో తొలగింప చేయండి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
అహ్మదాబాద్: ప్రభుత్వ ప్రకటనలలో ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఫోటోను ప్రచురించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజం ఒకటి దాఖలైంది. దావల్ షా అనే అహ్మదాబాద్ నివాసి హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రకటనలలో సోనియా ఫోటో లేకుండా చూసేలా చర్యలు చేపట్టే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌కు సూచనలు చేయాలని కోర్టును ఆయన కోరారు.

సోనియా గాంధీ ఎలాంటి రాజ్యాంగ పదవిలో లేనందున ఆమె ఫోటోను ప్రచురించడం సరికాదని దావల్ షా తన పిల్‌లో పేర్కొన్నారు. జాతీయ పార్టీ లేదా రీజనల్ పార్టీలకు అధ్యక్షులుగా లేదా చైర్మన్‌‌లుగా వ్యవహరించడం రాజ్యాంగ పదవుల కిందకు రాదని ఆయన చెప్పారు. కాగా దావల్ షా ఈ పిటిషన్‌ను విజయ్ అనే న్యాయవాది ద్వారా వేశారు. విజయ్ భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు.

కేంద్ర ప్రభుత్వం నిత్యం ఇచ్చే ప్రకటనలలో సోనియా ఫోటోను ఉపయోగిస్తుందని, ఈ ప్రకటనలకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తాయని, రాజ్యాంగ పరమైన పదవిలో లేనప్పుడు కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా వచ్చే ప్రకటనలలో ఫోటో వేయడం సరికాదన్నారు. ఇక నుండి కేంద్ర ప్రభుత్వ ప్రకటనలలో సోనియా ఫోటో ప్రచురించడం ఆపివేయాలని ఆయన కోర్టును కోరారు.

కాగా త్వరలో గుజరాత్‌లో సాధారణ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంచి విజయాలు సాధించారని, వీటిని కేంద్ర ప్రకటనల ద్వారా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు అన్నారు.

English summary
Congress president Sonia Gandhi's photos should not feature in government advertisements because she does not hold any constitutional position, argues a PIL filed in the Gujarat High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X