యుపిఎకు మమతా గుడ్‌బై: 21న మంత్రుల రాజీనామా

Mamata Banerjee
కోల్‌కత్తా: కేంద్ర ప్రభుత్వంనుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలగాలని మంగళవారం సాయంత్రం నిర్ణయించుకుంది. కేంద్రం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడానికి ముందు తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ నాయకత్వంలో కలకత్తాలో ఆ పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని, తమ కేంద్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తారని, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజీనామా చేస్తారని పార్లమెంటు సభ్యులతో జరిగిన సమావేశం తర్వాత మమతా బెనర్జీ చెప్పారు. యుపిఎలో రెండో అతి పెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెసు.

బొగ్గు కుంభకోణంనుంచి దేశం దృష్టిని మరల్చడానికే కేంద్రం ఎఫ్‌డిఐలను రంగంమీదికి తీసుకువచ్చిందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం పదే పదే ధరలు పెంచుతున్నందున తమకు గత్యంతరం లేని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆమె చెప్పారు. కేంద్రంలో తమకు సరైన గౌరవం లభించడం లేదని, డీజిల్ ధరల పెంపు విషయంలో గాని, గ్యాస్ సిలిండర్ల తగ్గింపు విషయంలో గాని, రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విషయంలో గాని కేంద్ర ప్రభుత్వం తమతో సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది.

అయితే కాంగ్రెస్ వర్గాలు ఈ వాదనతో ఏకీభవించడంలేదు. దేశ ఆర్థిక పరిస్థితి గురించీ, ఇంధనం పరిస్థితి గురించీ ముందునుంచీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు చెబుతూనే ఉన్నామని వారు అంటున్నారు. మూడు రోజుల క్రితం కూడా ప్రధాని ప్రభుత్వ వైఖరిని వివరించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెప్పారు. అయితే తర్వాత మాట్లాడతానని మమత అంతటితో ఆ సంభాషణను ముగించినట్టు తెలుస్తున్నది.

అయితే ప్రస్తుత పరిస్థితులలో తృణమూల్‌కు చెందిన 19 మంది టిఎంసి పార్లమెంటు సభ్యులు యుపిఎ నుంచి బయటకు వచ్చినా అటు సమాజ్ వాది పార్టీ 22 మంది పార్లమెంటు సభ్యులతోనూ, మాయావతి తమ 21 మంది బిఎస్పీ పార్లమెంటు సభ్యులతోనూ యుపిఎ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత యుపిఎ ప్రభుత్వం నిలబడాలంటే 272 మంది సభ్యుల మద్దతు అవసరం. తృణమూల్ వెళ్లిపోయినా ఎస్పీ, బిఎస్పీ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+