తిరుమల: ఇవో, చైర్మన్ మధ్య కంకణధారణ కలహం

సాధారణంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమానికి ముందుగా శ్రీవారి బంగారు వాకిలి వద్ద టిటిడి ఈవో కంకరణధారణ చేస్తారు. అప్పటి నుంచి ఆయనే ఉత్సవాలను దగ్గరుండి నడిపిస్తారు. ఈ కంకణధారణ చేసిన తర్వాత బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకు తిరుమల పొలిమేరలు దాటి వెళ్లకూడదనే నిబంధన ఉంది. ఈ ఆచారం అనాదిగా వస్తోంది.
అయితే, టిటిడి ఛైర్మన్‌లు కంకణ ధారణ చేసినా గతంలో కొందరు ఇవోలు పట్టించుకోలేదు. మరికొందరు ఈ ఆచారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, టిటిడి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు మాత్రం గత యేడాది అప్పటి టిటిడి ఈవోను ఒప్పించి తాను కూడా కంకణధారణ చేసుకున్నారు.
ఈ యేడాది కూడా ఈయనే ఛైర్మన్‌గా నియమితులు కావడంతో మళ్లీ కంకణధారణ చేయించుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ విషయం తెలిసిన ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సమ్మతించ లేదు. అయితే, రాజకీయ పలుకుబడిన కలిగిన కనుమూరి ఈవోను పక్కనబెట్టి కంకణధారణ చేయించుకున్నారు. ఇది ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీయడంతో ఈ కార్యక్రమానికి ఈవో దూరంగా ఉన్నారు.
ఈ విషయం చివరకు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. ఆయన పంచాయతీతో ఈవో శాంతించి బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకుంటున్నట్టు సమాచారం.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications