పార్టీకి అన్నా హజారే దూరం: కేజ్రీవాల్ షాక్

అన్నా తమకు తండ్రిలాంటివారని, తమకు అన్నా ఆలోచనలే ప్రాణాధారమని, తమతో అన్నా సంబంధాలు తెంచుకోవాలని అనుకోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. అది దిగ్భ్రాంతికరమైన పరిణామమే కాకుండా బాధాకరమైంది, విషాదకరమైంది, అనూహ్యమైందని ఆయన అన్నారు.
రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనపై అన్నా హజారే కేజ్రీవాల్ గ్రూప్‌తో, తమ మద్దతుదారులతో, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్‌లతో చర్చలు జరిపారు. తొమ్మిది గంటల చర్చల తర్వాత కిరణ్ బేడీ, సంతోష్ హెగ్డే వంటివాళ్లు కూడా పచ్చజెండా ఊపడంతో రాజకీయ పార్టీ పెట్టడానికి అన్నా హజారే అంగీకరించారు.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను ఉపయోగించి ఐఎసి నిర్వహించిన సర్వేను తాను అంగీకరించలేకపోతున్నానని అన్నా హజారే అన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో నిర్వహించిన సర్వేను ప్రాతిపదికగా తీసుకుని కేజ్రీవాల్ ఇతర అన్నా టీమ్ సభ్యులు రాజకీయ పార్టీని పెట్టేందుకు ముందుకు వచ్చారు.
రాజకీయ పంథాను చేపడుతున్నవారికి తన శుభాకాంక్షలు ఉంటాయని, దాంతో ప్రమాదం ఉందని, పార్లమెంటులో మెజారిటీ పొందితే మంచిదేనని, తమ మార్గాలు వేరయ్యాయని, ఇరు వర్గాలం వేర్వేరు మార్గాలు ఎంచుకున్నామని అన్నా హజారే అన్నారు.












Click it and Unblock the Notifications