మోడీని అడ్డుకోవడానికి యుపిఎకు ఎస్పీ మద్దతు

ఈ ప్రభుత్వం ఎప్పుడో పడిపోయేదని, అవినీతి, ధరల పెరుగుదల, సంకీర్ణంలో ఏకపక్ష ధోరణి వంటి కారణాల గురించి చాలా పార్టీలు తమ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే గుజరాత్ అల్లర్లను మరిచిపోలేమని, ప్రభుత్వం అల్లర్లను ఎలా ప్రోత్సహించిందో విస్మరించలేమని ఆయన అన్నారు.
తాము బిజెపి ముఖం ఏమిటో చూశామని, అటువంటి శక్తులు అధికారంలోకి వచ్చే అవకాశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. లౌకిక పార్టీల కూటమిగా యుపిఎ ఉందనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుందని రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా కాషాయ పార్టీ ముందుకు తెస్తోందని, ఈ విషయంలో తాము జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని, దాన్ని అడ్డుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications