కన్నబాబు-కన్ఫూజన్: చిరంజీవి ఎమ్మెల్యేకు తలనొప్పి!

Kanna Babu
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వర్గం తూర్పు గోదావరి జిల్లా శాసనసభ్యుడు కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి శాసనసభ్యుడు ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు(కన్నబాబు) కేసు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట! యలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటిను కూడా కన్నబాబుగానే పిలుస్తారు. ఇతని ఆస్తులు, ఇతని కుటుంబ ఆస్తుల పైన విచారణ జరపాలని ఇటీవల విశాఖ ఎసిబి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అతని ఆస్తులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. రెండు రోజుల క్రితం కూడా ఉప్పలపాటి ఓ రియాల్టర్‌ను భూమి అమ్మాలని బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆయన అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టారనే విమర్శలు ఉన్నాయి. విశాఖలో ఇతను ఓ ఆధునాతన భవంతిని నిర్మించుకున్నారు. యలమంచిలి ఎమ్మెల్యేగా ఉన్న ఇతను అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఫిర్యాదులు ఉన్నాయి.

అయితే ఈ కన్నబాబుపై వస్తున్న ఆరోపణలతో చిరంజీవి వర్గం కన్నబాబు ఇబ్బందులు పడుతున్నారట. యలమంచిలి ఎమ్మెల్యేను కన్నబాబుగా పిలిచినప్పటికీ సాధారణంగా అందరికీ ఆ పేరుతో పిలవగానే చిరంజీవి వర్గం ఎమ్మెల్యేనే గుర్తుకు వస్తారు. కన్ఫ్యూజన్ కారణంగా పలువురు ఈ కన్నబాబును ఆస్తులు, కేసులపై ప్రశ్నిస్తున్నారట. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మీరు విశాఖలో ఆకాశ హర్మ్యం ఎందుకు నిర్మించుకున్నారని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.

చిరంజీవికి ఈ కన్నబాబు దగ్గరి వారు కావడంతో ఆయన కార్యాలయానికి కూడా ఈ వ్యవహారంపై ఫోన్లు వస్తున్నాయట. ఇతనిని కనిపించిన సన్నిహితులు సైతం ప్రశ్నిస్తున్నారట. దీంతో అతను ఆ కన్నబాబును తాను కాదు మొర్రో అని వారి వద్ద మొరపెట్టుకుంటున్నారట!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+