తెలంగాణ మార్చ్ విషయంలో జోక్యం లేదు: నరసింహన్

Narasimhan
న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం అన్నారు. ఆయన న్యూఢిల్లీలో బిజిబిజిగా గడుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో ఆయన మధ్యాహ్నం భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ మార్చ్ తదితర అంశాలపై చిదంబరంతో నరసింహన్ చర్చించినట్లుగా సమాచారం.

అంతకుముందు నరసింహన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మార్చ్ విషయంలో ఢిల్లీ స్థాయిలో జోక్యం ఉండదన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల స్తంభనపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. తాను కేంద్రమంత్రి నారాయణ స్వామితో తదుపరి భేటీ అవుతానని చెప్పారు.

కాగా ఢిల్లీ వెళ్లిన నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన గురువారం కూడా తీరిక లేకుండా గడిపారు. గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. వీరి మధ్య ప్రధానంగా తెలంగాణపైనే చర్చ జరిగినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే రాష్ట్ర రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. దాదాపు 45 నిమిషాల పాటు సోనియా గాంధీతో గవర్నర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత గవర్నర్ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలతో భేటీ అయ్యారు.

ఉప రాష్ట్రపతితో దాదాపు 20 నిమిషాల పాటు నరసింహన్ చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్‌ను కలుసుకున్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌తో నరసింహన్ భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరాలతో కూడా గవర్నర్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రానున్న నేపథ్యంలో గవర్నర్ భేటీలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+