వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారంలో సింగ్ కేబినెట్లోకి చిరంజీవి: రాహుల్ గాంధీ నో!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Rahul Gandhi
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెసు పార్టీ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం నుండి నిష్క్రమిస్తున్న నేపథ్యంలో వారం రోజుల్లో పునర్వవస్థీకరించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం, వీరభద్ర సింగ్ వంటి వారు అవినీతి ఆరోపణలతో కేబినెట్ నుండి ఇప్పటికే బయటకు వెళ్లిపోయారు. తాజాగా టిఎంసి మంత్రులు కూడా గుడ్ బై చెప్పనున్నారు. శుక్రవారం ఏ సమయంలోనైనా వారు తమ రాజీనామాలు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో ఖచ్చితంగా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది.

ఈసారి మార్పులు చేర్పులు భారీగానే ఉండే అవకాశముంది. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ, ఆర్థికమంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేల స్థానం పదిలమే అయినప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగినా జరగవచ్చంటున్నారు. త్వరలో గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు, లోకసభ ఎన్నికల సన్నద్ధత కోసం పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మరికొందరిని మంత్రివర్గం నుండి తొలగించి రాష్ట్రాల బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి సహాయ శాఖ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయ. ఒకటికి మించి శాఖలు నిర్వహిస్తున్న పలువురు మంత్రులను అదనపు బాధ్యతల నుండి తప్పించి ఇతరులకు అప్పగించే అవకాశాలున్నాయి.

2జి కుంభకోణంలో అరెస్టైన రాజా రాజీనామా తర్వాత ఆ శాఖను సిబాల్ చూస్తున్నారు. దయానిధి మారన్ శాఖ ఖాళీగా ఉంది. టిఎంసికి చెందిన ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఆ శాఖను కాంగ్రెసు తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇక రాహుల్ గాంధీని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎప్పటి నుండో డిమాండ్లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ మాత్రం ఇప్పటికీ మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేరట. ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

English summary

 It is said that Rahul Gandhi is unlikely to join the Cabinet in a reshuffle. There was speculation that the Congress general secretary might take up a ministry. The speculation was also fuelled by the fact that Congress leaders had made public announcements about a "big decision" regarding Mr Gandhi. The Prime Minister too had said several times that he would welcome it if Mr Gandhi joins government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X