వేరే వాళ్లతో పెళ్లిళ్లై వేరైన లవర్స్: కలిసి ఆత్మహత్య

ప్రేమికులిద్దరు చామ్‌నగర్‌లోని కొల్లెగళ్‌లో ఉండేవారు. సౌమ్యకు మాజీ భర్త, ఏడాది వయస్సు గల కూతురు ఉన్నారు. రమేష్‌కు భార్య ఉంది. అతనికి జనవరిలో వివాహమైంది. అతని భార్య ఆరు నెలల గర్భవతి. రమేష్, సౌమ్య పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే, పెద్దలు అందుకు నిరాకరించారు.
వారు కొల్లెగళ్‌లోని వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు. ఆ కుటుంబాలు పక్కపక్కనే ఉన్నాయి. వారు 2008లో ప్రేమలో పడ్డారు. తల్లిదండ్రులు సౌమ్యను మైసూరుకు చెందిన వ్యక్తి ఇచ్చి 2009లో వివాహం చేశారు.
ప్రేమికులు ఇద్దరు మళ్లీ 2011లో కలిశారు. వారు ఒకరినొకరు కలుస్తూనే ఉన్నారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. వారు కలుస్తున్న విషయం కుటుంబాలకు తెలియదని అంటున్నారు. రమేష్ జనవరిలో కొల్లెగళ్‌కు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. రమేష్, సౌమ్య ఆగస్టులో కొల్లెగళ్‌ను వదిలేసి రాష్ట్రమంతా తిరిగారు. తాము కలిసి జీవించలేకపోయామని, అయితే తమ శరీరాలను కలిపి అంత్యక్రియలు చేయాలని, తాము ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని వారు సూసైడ్ నోట్‌లో రాశారు.












Click it and Unblock the Notifications