టిఎంసి టీం రిజైన్: బెంగాల్లో మమతకు కాంగ్రెస్ ఝలక్!

ముకుల్ రాయ్‌తో పాటు సౌగత రాయ్, శిశిర్ అధికారి, మోహన్ జాతౌ, సుల్తాన్ అహ్మద్, సుదీప్ బందోపాధ్యాయలు రాజీనామా ఇచ్చారు. అనంతరం టిఎంసి ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. తాము యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని చెబుతూ వారి ప్రణబ్‌కు లేఖ ఇచ్చారు. ఇటు కేంద్రంలో టిఎంసి మద్దతు ఉపసంహరించుకోగానే పశ్చిమ బెంగాల్ కాంగ్రెసు మమతకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కాంగ్రెసుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెసు లేకపోయినప్పటికీ టిఎంసి ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు. అయితే కేంద్రానికి మమత తన మద్దతు ఉపసంహరించుకోవడంతో.. బెంగాల్ కాంగ్రెసు కూడా రాష్ట్రంలో ఆమెకు మద్దతు ఉపసంహరించేందుకు నిర్ణయించుకుంది. మమతా బెనర్జీ మంత్రివర్గంలోని కాంగ్రెసు మంత్రులు రేపు(శనివారం) రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.
కాగా ఎఫ్‌డిఐలను, పెట్రో పెంపును నిరసిస్తూ టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం వెనక్కి తగ్గితే మద్దతుపై పునరాలోచిస్తామని ఆమె హెచ్చరించారు. మమత హెచ్చరికలను కేంద్రం బేఖాతరు చేస్తూ ఎఫ్‌డిఐ జివోను జారీ చేసింది. దీంతో టిఎంసి మంత్రులు శుక్రవారం రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications