వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లింటన్‌తో ప్రేమాయణంపై మోనిక పుస్తకం, ఖండన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Monica Lewinsky
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో తన ప్రేమాయణాన్ని పుస్తక రూపంలో తీసుకు వచ్చేందుకు ఆయనతో ప్రేమ వ్యవహారం సాగించిన మోనికా లూయిన్‌స్కీ ప్రయత్నాలు చేస్తోందట. బిల్ క్లింటన్‌తో అఫైర్‌‌కు సంబంధించిన పూర్తి వివరాలను, రాసిన లేఖలను ఓ పుస్తకంగా తీసుకు రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్టు అనే అమెరికా పత్రిక తెలిపింది.

క్లింటన్‌కు రాసిన ప్రేమ లేఖలన్నింటికీ ఈ పుస్తకంలో చోటు ఉంటుందట. క్లింటన్ తన భార్య గురించి చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె తన పుస్తకంలో చెప్పనుందట. మోనికా లూయిన్‌స్కీ రాసిన ప్రేమ లేఖల్లో కొన్ని క్లింటన్‌కు పోస్టు చేయనవి కూడా ఉన్నాయని, వీటిని ఆమె బహిర్గతం చేయనుందని ఆమె సన్నిహితురాలు ఒకరు చెప్పినట్లుగా ఆ పత్రిక తెలిపింది.

పుస్తకాన్ని తీసుకు వచ్చేందుకు సిద్ధమైన మోనికా లూయిన్‌స్కీ ఇందుకోసం 12 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఓ ప్రముఖ పుస్తక పబ్లిషర్స్‌తో కుదుర్చుకుందట. ఈమె బిల్ క్లింటన్ పైన రివేంజ్ తీసుకోవడానికే ప్రేమ లేఖల పుస్తకాన్ని, ఆయన తన భార్య గురించి పేర్కొన్న విషయాలను పుస్తక రూపంలో తేవాలనకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

39 ఏళ్ల మోనికా లూయిన్‌స్కీ గతంలోని పలు ఇంటర్వ్యూలలో క్లింటన్‌తో ఉన్న సంబంధాలను చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం పుస్తక రూపంలో తీసుకు వచ్చేందుకు సిద్ధపడిందని సన్నిహితురాలు చెప్పినట్లుగా పత్రిక పేర్కోంది. మరోవైపు క్లింటన్‌తో తన ప్రేమాయణానికి సంబంధించిన లేఖలను మోనికా పుస్తక రూపంలో తీసుకు వస్తుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరికొందరు ఆమె సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు.

English summary
Despite reports that Monica Lewinsky plans to publish a book that will include love letters to president Bill Clinton and potentially scandalous details about their relationship, sources close to the former Whith House intern say this is not true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X