క్రమశిక్షణఉంది: విభజనపై శైలజానాథ్, జెఏసి వార్నింగ్

తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చాలన్నారు. మరికొందరు నేతలు ఢిల్లీకి రేపు వస్తున్నట్టు శైలజానాథ్ చెప్పారు. రాష్ట్ర విభజననా, సమైక్యాంధ్రనా అనే విషయాన్ని పార్టీ అధిష్టానం వెంటనే తీసుకోవాలన్నారు. తాము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలమని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తామని చెప్పారు. శైలజానాథ్ ఢిల్లీ బయలుదేరే ముందు కావూరిని కలిశారు.
రాజీనామాకు సిద్ధం కండి.. శామ్యూల్
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడాలని సమైక్యాంధ్ర రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ శ్యామ్యూల్ గుంటూరులో డిమాండ్ చేశారు. రేపటి నుండి సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. తెలంగాణకు మద్దతిచ్చే నేతలను తాము సీమాంధ్రలో తిరగనివ్వమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications