వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తర్వాతే తెలంగాణపై నిర్ణయం: వాయలార్, విలీనం పైనా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi
న్యూఢిల్లీ: తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదని, అఖిల పక్షాల అభిప్రాయం తర్వాతే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు వాయలార్ రవి శనివారం అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీన ప్రస్తావనేదీ కెసిఆర్ తన వద్ద చేయలేదని చెప్పారు. చైనా పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చిన వయలార్ రవి కేరళ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తెరాస విలీనంపై అడగ్గా... కెసిఆర్ ఇటీవల రెండు మూడు సార్లు తనను కలిశారని, ఈ సందర్భంగా ఆయన విలీన ప్రస్తావనేమీ తేలేదని చెప్పారు. టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లోకి విలీనం అవుతున్నట్టు ప్రచారం ఎందుకు జరుగుతుందో తనకు తెలియదన్నారు. నాలుగు రోజులుగా ఢిల్లీలో లేనని, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్నా కానీ తెలంగాణ అంశాన్ని చెప్పలేనని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

తెలంగాణ ప్రాంతం వారు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారని, సీమాంధ్రులు సమైక్యాంధ్ర ఉండాలంటున్నారని, ఇరు ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అఖిలపక్షంలో పార్టీల వైఖరి తెలుసుకోవాలని, ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. తమ పార్టీలో కూడా కొందరు తెలంగాణ కోరుతుండగా, మరికొందరు వద్దంటున్నారని వాయలార్ రవి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు మిగిలిన పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. విలీనం అంటే అంత ఈజీ కాదని, చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా ఢిల్లీలో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలు ఇటీవల వినిపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Union minister Vayalar Ravi on Saturday said the central government would have to consult other political parties and sections of Congress leaders in the state before taking a final view on Telangana. Mr Ravi, who has been negotiating with Telangana Rashtra Samiti president K. Chandrasekhar Rao on Telangana issue, was speaking to newsmen after returning from Shanghai late in the evenaing, before leaving for Kochi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X