కరవలేనప్పుడు బుసకొడతా, అవకాశం: మమతా బెనర్జీ

రామకృష్ణ పరమహంస చెప్పిన నీతి కథను ఉటంకిస్తూ ఆమె అలా అన్నారు. అధికారపు అహంకారానికి తాను తల వంచేదే లేదని స్పష్టం చేశారు. తమపై ఎంతగా అరిస్తే అంత గట్టిగా తమ నిరసనలు ఉంటాయని, భయపెట్టజూస్తే గర్జిస్తామని, తాము పేదలమే కావొచ్చు కానీ, తమకు ఆత్మగౌరవముందన్నారు. తాము దేవుడు, భూమి, ప్రజలకే తలవంచుతామని, దర్పంతో కూడిన అధికారానికి మాత్రం కాదన్నారు.
ప్రజలే ప్రజాస్వామ్యానికి ప్రధాన ఆస్తి అని, పశ్చిమ బెంగాల్ ఐ రోజు ఏవిధంగా ఆలోచిస్తుందో.. ప్రపంచం రేపు అదే విధంగా ఆలోచిస్తుందన్నారు. కాగా, ఎఫ్‌డిఐల అంశం మీద పార్లమెంటు తదుపరి సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. మమతతో పార్టీకి చెందిన తాజా మాజీ కేంద్ర మంత్రుల భేటీ అనంతరం సీనియర్ నేత సౌగతా రాయ్ ఈ మేరకు వెల్లడించారు. 26న ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించాలని కూడా తృణమూల్ ఎంపీలు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications