ముందస్తు బెయిల్ కోరని మంత్రి ధర్మాన: కోర్టుకు జగన్!

YS Jagan - Dharmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాద రావు ఎలాంటి ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. ధర్మాన ఈ రోజు(మంగళవారం) నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నారు. వాన్‌పిక్ భూకేటాయింపులపై ఇటీవల కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ ధర్మానను ఐదో నిందితుడిగా పేర్కొంది. దీంతో ఈ రోజు ఆయన ధర్మపీఠంపై నిల్చోనున్నారు.

ఇప్పటికే ఆస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌ను సిబిఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ధర్మానను కూడా అరెస్టు చేయవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధర్మాన మాత్రం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నాలు మాత్రం చేయలేదని సమాచారం. అయితే కోర్టుకు హాజరైన అనంతరం ధర్మాన కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జీషీట్ కాపీని తీసుకోనున్నారు.

ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. సిబిఐ కోర్టులో కూడా అతను జగన్ ఆస్తుల కేసు విషయంలో ఛార్జీషీటులో ఉన్న తన పేరును తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేసే అవకాశముంది. కాగా జగన్ ఆస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న నిందితులు అందర్ని ఈ రోజు సిబిఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. జగన్ కేసుతో పాటు ఎమ్మార్, ఓఎంసి కేసు నిందితులనూ కోర్టులో హాజరు పర్చనున్నారు.

జగన్‌ను కోర్టుకు తీసుకు రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో ఇప్పటి వరకు అతనిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. కానీ వాన్‌పిక్ పైన దాఖలు చేసిన ఛార్జీషీట్ ఇంపార్టెన్స్ నేపథ్యంలో ఆయనను ఈ రోజు కోర్టుకు తరలించనున్నారు. ఇందుకోసం చంచల్‌గూడ జైలు నుండి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు జగన్‌ను తీసుకు వెళ్లే రహదారిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పది గంటలకు జగన్‌తో సహా నిందితులను కోర్టులో హాజరు పర్చనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+