విద్యార్థినులకు టీచర్ లైంగికంగా వేధింపులు, అరెస్ట్

ఇతను నవ నరోడా ప్రాంతంలోని కృష్ణ విద్యాలయ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి వరకు గణితం, సామాన్య శాస్త్రం బోధిస్తుంటారు. పటేల్ తమ కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్నారని ఎనిమిదో తరగతి విద్యార్థినుల తల్లిదండ్రులు పలువురు పాఠశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. పటేల్ తన కూతురిని కూడా వేధించినట్లు అతను చెప్పాడు.
పటేల్ పైన ఒక్కటొక్కటిగా పలు ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌కు కూడా నవీన్ పటేల్ పైన ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల యాజమన్యం దీనిపై విచారణ జరిపి అతనిని ఉద్యోగం నుండి శనివారం తొలగించింది. ఆ తర్వాత వారు నరోడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఫిర్యాదుతో తాము నవీన్ పటేల‌్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications