గర్ల్ ఫ్రెండ్ లైవ్‌లో చూస్తుండగా యువకుడి ఆత్మహత్య

 Youth commits suicide live on webcam after argument with girlfriend
లక్నో: గర్ల్ ఫ్రెండ్ చూస్తుండగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వారణాసిలో జరిగింది. గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ పడిన అనంతరం వెబ్‌కామ్ ఆన్‌లో ఉండగానే ఆమె చూస్తుండగా అతను ఉరేసుకుని మరణించాడు. గర్ల్‌ఫ్రెండ్‌తో వెబ్ కామ్ ద్వారా లైవ్ చాట్ చేస్తూ తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పాతికేళ్ల అంకిత శ్రీవాస్తవ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఆ దారుణమైన సంఘటనను గర్ల్ ఫ్రెండ్ చూస్తూనే ఉంది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం - పడకగదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న అంకిత్ శవాన్ని అతని తల్లి చూసింది. పర్సనల్ కంప్యూటర్‌లో వెబ్‌కామ్ ఆన్ చేసి ఉంది. పగిలిపోయిన మొబైల్ ఫోన్ కింద పడి ఉంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కోపంతో అంకిత సెల్‌ఫోన్‌ను విసిరికొట్టి ఉంటాడు.

ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ అయిన అంకిత్‌కు కోపం ఎక్కువని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాత్రి పూట ప్రతి రోజూ గర్ల్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ ఉండేవాడని అంటున్నారు. వీడియో చాటింగ్ సందర్భంగా తీవ్ర వాగ్వివాదం కారణంగానే అంకిత్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ సంఘటన శనివారం జరిగినప్పటికీ అమ్మాయిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు అంకిత్ ఆత్మహత్యా యత్నానికి దిగాడని వారణాసి నగర పోలీసు సూపరింటిండెంట్ సంతోష్ సింగ్ మీడియాకు చెప్పారు. అంకిత్ తల్లి ఓ స్కూల్ టీచర్ కాగా, తండ్రి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+