నేను మధ్యవర్తిని కాను: మార్చ్ విజ్ఞప్తిపై జానా

తెలంగాణ మార్చ్ శాంతియుతంగా జరుగుతుందని, అందుకు తాము బాధ్యత తీసుకుంటామని తెలంగాణ జెఎసి నాయకులు తనతో చెప్పారని, ఇంకా చాలా విషయాలు చెప్పారని, అవన్నీ మీడియాకు చెప్పేవి కావని ఆయన అన్నారు. మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లుగానే తనను కోరారని, అందువల్ల ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వ ప్రతిష్టను పెంచే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలంటారా, వద్దంటారా అని మీడియా ప్రతినిధులు పదే పదే అడగడంతో ఆయన ఆ విధంగా అన్నారు. ముఖ్యమంత్రితో తనకు తెలిసిన విషయాలను పంచుకుంటానని, ముఖ్యమంత్రికి తెలిసిన విషయాలను తనకు చెబుతారని, తామిద్దరం మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం జరుగుతుందని ఆయన చెప్పారు. నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి తీసుకుంటారని ఆయన అన్నారు.
తామిద్దరం మాట్లాడుకుంటున్న క్రమంలో విషయాలు మీడియా ప్రతినిధులకు తెలుస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇస్తే మంచిదా, కాదా అనే విషయాన్ని తాను, ముఖ్యమంత్రి కలిసి చర్చించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని తాను కోరడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications