రాజీనామా: కెకె సంచలన వ్యాఖ్యలు, రాహుల్ పైనేనా

తెలంగాణపై చూపిస్తున్న నిర్లక్ష్యం తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు. తెలంగాణ మార్చ్‌ని వాయిదా వేసే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి మార్చ్‌ని వాయిదా వేసుకోవాలని కోరిన మాట వాస్తవమేనని, అయితే తాము మాత్రం తగ్గేది లేదని చెప్పామన్నారు. వారు ఫోన్ చేసి కోరినప్పటికీ తాను నిరాకరించానని చెప్పారు. మార్చ్ అంశంపై చర్చించేందుకే తాను మంత్రి జానా రెడ్డిని కలిశానని తెలిపారు.
తెలంగాణ ప్రాంత మంత్రులు, పార్లమెంటు సభ్యులు మార్చ్‌కు మద్దతిస్తారన్నారు. టి-మంత్రులే మార్చ్‌కు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకు రావాలని సూచించారు. అనుమతిస్తే ఎలాంటి హింస జరగదని కె కేశవరావు హామీ ఇచ్చారు. మార్చ్ వాయిదా వేయించేందుకు తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నాననే వాదనలో ఎలాంటి నిజం లేదన్నారు. తనపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన చెందారు.
అనుమతివ్వాలి... శంకర రావు
మార్చ్‌కి ప్రభుత్వం వెంటనే అనుమతివ్వాలని మాజీ మంత్రి శంకర రావు సూచించారు. అలాగే తెలంగాణవాదులు కూడా మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
యాష్కీకి చేదు అనుభవం
నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీకి స్థానికంగా బుధవారం చేదు అనుభవం ఎదురయింది. ఆయన మీసేవా తనిఖీకి వచ్చారు. ఈ సమయంలో అతనిని పిడిఎస్‌యు విద్యార్థులు అడ్డుకున్నారు. ఓ వైపు పోలీసులు అరెస్టులు చేస్తుంటే విహార యాత్రలా అంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications