పోటీ చేస్తా, జగన్‌కు ఓటు బాధ కలిగించింది: నటి కవిత

చంద్రబాబు సేవా గుణాన్ని చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆశీస్సులతో ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత వెల్లడించారు.
బాపూజీకి చంద్రబాబు నివాళి
చేనేత పరిశ్రమకు గుర్తింపు తెచ్చేందుకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎనలేని కృషి చేశారని నారా చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టిడిపి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం చివరి రోజైన మంగళవారంనాడు బాపూజీకి ఆయన నివాళులర్పించారు. తుది శ్వాస విడిచే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని అన్నారు. బాపూజీ లేని లోటు పూడ్చలేనిదన్నారు. బాపూజీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి ప్రకటించారు.












Click it and Unblock the Notifications