వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిట్ ఫర్ టాట్: మమతకు షాక్, అఖిలేష్‌కు రెడ్‌కార్పెట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akhilesh Yadav-Mamata Banerjee
న్యూఢిల్లీ: యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కాంగ్రెసు పార్టీ గట్టి ఝలక్ ఇచ్చింది. అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సును పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహించాలని కేంద్రం మొదట నిర్ణయించింది. అయితే మమత ఇచ్చిన షాక్‌కు తేరుకున్న కాంగ్రెసు కౌంటర్‌గా దీనిని ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా నగరానికి తరలిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.

సదస్సుకు పశ్చిమ బెంగాల్ సదస్సు సహకరించడం లేదని కేంద్రం ఆరోపిస్తూ దీనిని కోల్‌కతా నుండి ఆగ్రాకు తరలించింది. మమతా బెనర్జీ మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత యూపిఏ ప్రభుత్వానికి సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. షాక్ ఇచ్చిన మమతకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెసు, ఆపదలో చేయి అందించిన ఎస్పీకి రెడ్ కార్పెట్ సదస్సు విషయంలో రెడ్ కార్పెట్ పరిచింది.

పశ్చిమ బెంగాల్ ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ పెట్టుబడుల సదస్సును ఉపయోగించుకొని పలు పెట్టుబడులు తీసుకు వచ్చి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలని, తద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పించినట్లవుతుందని, సదస్సును చూపి కేంద్రం నుండి భారీగా నిధులు కూడా సమకూర్చుకోవచ్చునని మమత ప్రభుత్వం భావించింది. సదస్సు కోల్‌కతా నుండి ఆగ్రాకు మార్చడంతో బెంగాల్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనే చెప్పవచ్చు.

English summary
By now it is clear, after Trinamool Congress (TMC) Supremo Mamata Banerjee withdrew her support from Congress-led UPA government at the Centre, the road ahead for West Bengal Chief Minister won't be smooth. Observers say that government at the Centre will try to create problems for Mamata in running her government in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X