ఢిల్లీ అరబిందో ఆశ్రమంలో ఫ్రెంచ్ మహిళ మృతి

New Delhi
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అరబిందో ఆశ్రమంలో 53 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ మరణించింది. ఆశ్రమంలోని తన వసతిలో ఆమె మృతదేహం కనిపించినట్లు పోలీసులు చెప్పారు. మేరీ రాబర్ట్ వానెరిక్ అనే ఆ మహిళ జులై 17వ తేదీన భారతదేశానికి వచ్చింది.

దక్షిణ ఢిల్లీలోని మాలవ్యా నగర్‌లో గల అరబిందో ఆశ్రమంలోని తన గదిలో సోమవారం ఉదయం ఆమె మరణించినట్లు గుర్తించారు. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆ విషయాన్ని ఆశ్రమం కేర్ టేకర్ గుర్తించారు. తాళాన్ని పగులగొట్టి పోలీసులు గదిలోకి ప్రవేశించారు. స్నానాల గదిలో కుళ్లిపోయిన ఆమె మృతదేహం పోలీసులకు కనిపించింది.

ఆమెది సహజమైన మరణమేనని పోలీసులు భావిస్తున్నారు. ఆమె దేహంపై గాయాలేమీ కనిపించడం లేదని, అందువల్ల అది సహజమరణమేనని వారంటున్నారు.

ఆమె గత పాతికేళ్లుగా అరబిందో ఆశ్రమంతో సంబంధాలు పెట్టుకుంది. తరుచుగా ఆమె ఈ ఆశ్రమానికి వస్తూ పోతూ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+