అంత సీన్ లేదు: వల్లభనేని, బాబుకు కాదు.. దేవినేని

చంద్రబాబుపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను రాళ్లతో కొడతారని మరో నేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా, ఇష్టం వచ్చిన రీతిలో ప్రకటనలు చేసి మూడు ప్రాంతాల విద్యార్థులను నాశనం చేసింది కాంగ్రెస్సే అన్నారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చి, అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరడంలో తప్పేముందన్నారు.
లగడపాటికి దమ్ముంటే లేఖ రాయాల్సింది చంద్రబాబుకు కాదని.. వారి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అన్నారు. చంద్రబాబుకు మూడు పేజీల లేఖ రాయడం కాదని.. సోనియాకు లేఖ రాసి తెలంగాణను వెంటనే తేల్చాలని డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. కాంగ్రెసు పాలనలో రాష్ట్రం ఆర్థికంగా ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడిపై కాంగ్రెసు నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య అన్నారు. తమది మొదటి నుండి సమైక్యవాదమే అన్నారు.












Click it and Unblock the Notifications