ఒబామా గెలిస్తే బట్టలిప్పుతానన్న పాప్ స్టార్ మడోన్నా

ఈ సందర్భంగా ఆమె ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా అయితే తాను నగ్నంగా నిలబడతానని సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో ఒబామాను నల్లజాతి ముస్లింగా ఆమె అభివర్ణించారు. ఆయన విజయాన్ని తాను కోరుకుంటున్నానని చెప్పారు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఒబామా ఎంతగానో పోరాడారని కితాబు ఇచ్చారు.
ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. తన వీపు వెనుక రాసి ఉన్న ఒబామా అనే అక్షరాలను ఆమె ప్రేక్షకులకు చూపించారు. తన వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో.. ఒబామా క్రైస్తవుడనే విషయం తనకు తెలుసని చెప్పారు. అయితే అమెరికాలో అత్యధిక శాతం మంది నమ్ముతున్న విషయాన్నే తాను చెప్పానని తెలిపారు. ఆ తర్వాత ఒబామాను ముస్లిం అన్నందుకు పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో మడోన్నా క్షమాపణలు కోరింది.












Click it and Unblock the Notifications