కూతుర్ని పెళ్లాడితే రూ.350 కోట్లు: తండ్రి భారీ ఆఫర్

Hong Kong businessman offers $65 million to someone who will marry his daughter
హాంగ్‌కాంగ్: తన కూతురును ఎవరైనా మెప్పించి పెళ్లి చేసుకుంటే 65 మిలియన్ డాలర్లు ఇస్తానని ఓ హాంగ్‌కాంగ్ వ్యాపారవేత్త ప్రకటించారు. జిజీ చావో అనే యువతి వయస్సు 33 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. ఎవరైనా ఈమెను మెప్పించి ఒప్పించి పెళ్లాడితే అంత పెద్ద మొత్తం డబ్బు ఇస్తానని చెబుతున్నాడు తండ్రి సెసిల్ చావో జె సుంగ్. ఈయన హాంకాంగ్‌లో అపరకుబేరుడు.

మెప్పించి అన్న చోటే చిన్న చిక్కు ఉంది. జిజీ లెస్బియన్. అంటే మహిళలతో మాత్రమే సంపర్కంలో పాల్గొనే స్త్రీ. ఈమెకు సీన్ ఈవ్ సహధర్మచారిణి. వీరిద్దరూ అమ్మాయిలే. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి మొగ్గ తొడగటంతో ఈ ఏడాదే ఫ్రాన్స్‌లో ఒక్కటయ్యారు. మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్‌లో పట్టా పొందిన తన కుమార్తెను యోగ్యుడైన వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలన్నది వ్యాపారవేత్త సెసిల్ చావో కోరిక.

కానీ అమ్మాయేమో లెస్బియన్. దీంతో తన కుమార్తెను ఎవరైనా మెప్పించి ఒప్పించి పెళ్లాడితే రూ.350 కోట్లు కట్నకానుకగా ఇచ్చి సలక్షణంగా వివాహం చేసేందుకు సిద్ధమని ఆయన బహిరంగంగా ప్రకటించాడు. దీంతో ఆమెను పెళ్లాడతానంటూ జిజీ చావో ఫేస్‌బుక్ చిరునామాకు కుప్పలు తెప్పలుగా సందేశాలు వచ్చిపడుతున్నాయి. విశేషమేంటంటే.. అందులో కొంతమంది గేలు (స్వలింగ సంపర్కులు) కూడా ఉన్నారట.

తన తండ్రి ప్రతిపాదన ఆసక్తికరంగా ఉందని, స్వలింగ సంపర్కంపై ఉన్న సామాజిక కట్టుబాట్ల కారణంగానే తన తండ్రి భారీ మొత్తాన్ని ప్రకటించి ఉండవచ్చని జిజీ చావో వ్యాఖ్యానించింది. ఈమె మోడలింగ్‌తోపాటు పలు వ్యాపారాలను నిర్వహిస్తోంది. మరో విషయమేమంటే ఆమె తండ్రి కూడా తక్కువేమీ తినలేదు. తనకు పదివేల మంది అమ్మాయిలతో తనకు స్నేహం ఉందని ప్రకటించారు. సిసిల్ చావోకు స్థిరాస్తి వ్యాపారంతోపాటు నౌకలు కూడా ఉన్నాయి. ప్లేబాయ్‌లా గడిపే ఆయన ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు. ఆయన ముగ్గురు సంతానంలో జిజీ చావో పెద్ద కుమార్తె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+