రాజీనామాలకు టైం: జానా, టిటిడిపి ఎమ్మెల్యేల అరెస్ట్

కవాతు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. తెలంగాణవాదులు ఎవరైనా కవాతుకు రావడం ఆలస్యమైతే ఎక్కడికి అక్కడే మార్చ్‌లో పాల్గొనాలని సూచించారు. ఈ కవాతు కేంద్రాన్ని కదిలిస్తుందన్నారు. కవాతును తెలంగాణ హారంగా మార్చాలని తెలంగాణవాదులను కోరారు. పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, అలా చేయడం సరికాదన్నారు. కవాతు ప్రశాంతంగానే జరుగుతుందన్నారు.
అరెస్టులపై అసంతృప్తి వ్యక్తం చేసిన జానా.. పదవులు వదులుకునే సమయమొచ్చిందన్నారు. పదవులలో కొనసాగాలా వద్దా అని తెలంగాణ మంత్రులం ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పదవులను లెక్క చేయని రోజు వస్తుందని జానా రెడ్డి అన్నారు.
అసెంబ్లీ వద్ద టిటిడిపి ఎమ్మెల్యేల అరెస్ట్
తెలంగాణవాదుల అరెస్టును నిరసిస్తూ తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో టిటిడిపి నేతలు ముళ్లకంచెను, బారీకేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది.












Click it and Unblock the Notifications