హీరోలకు డైరెక్టర్ శంకర్ సూచన: మళ్లీ టి-ఎంపీల ధర్నా

Shankar
హైదరాబాద్: సినిమాలలో హీరోయిజం చూపెట్టే తెలుగు సినీ హీరోలు నిజమైన హీరోలుగా మారాలని ప్రముఖ దర్శకులు శంకర్ ఆదివారం అన్నారు. తెలంగాణ కవాతు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిజమైన హీరోలు ఎవరైనా ఉంటే కళాకారుడిగా బాసటగా నిలవాలని హితవు పలికారు. హీరోలు తెలంగాణ కవాతులో పాల్గొంటే స్వాగతిస్తామన్నారు.

మా ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తే ఆ హీరోలకు అంతకంటే ఎక్కువ గౌరవమిస్తామన్నారు. తాను పలువురు సినీ ప్రముఖులకు ఫోన్ చేశానని, అయితే ఫోన్ చేసినట్లుగా చెబుతామని సంబంధీకులు చెప్పారన్నారు. వారి నుండి ఫోన్ల కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో ఎవరూ థియేటర్లు ఓపెన్ చేయవద్దని, అలా అని నిర్ణయం తీసుకున్నామని, ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

పోరాటం ఆగదు.. కవిత

తెలంగాణ వచ్చే వరకు పోరాటం సాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కవాతుకు మద్దతుగా ఆమె సికింద్రాబాదులోని క్లాక్ టవర్ నుండి కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు. కవాతును అడ్డుకోవద్దని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇది శాంతియుతంగా జరిగే కవాతు అని... అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం కుట్రలను నిరసిస్తూ.. పోలీసుల కళ్లు కప్పి కష్టపడి అయినా కవాతుకు రావాలని ఆమె తెలంగాణవాదులను కోరారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు పొందేందుకే పోలీసులు, డిజిపి దినేష్ రెడ్డి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. పోలీసులు, డిజిపిపై కేసులు పెట్టాలన్నారు.

ఎంపీల విడుదల మళ్లీ క్యాంప్ ఆఫీస్‌కు

అదుపులోకి తీసుకున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను పోలీసులు విడుదల చేశారు. ఎంపీలు మళ్లీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. లోనికి వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు మళ్లీ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విడుదల చేయాలి... మోత్కుపల్లి

కవాతు శాంతియుతంగా చేయాలని తలపెడితే ప్రభుత్వం హింసాత్మకంగా మార్చే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. అక్రమంగా అరెస్టు చేసిన తెలంగాణవాదులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+