ఫోన్లో కిరణ్‌కు జానా క్లాస్, వాగ్వాదం: ఎంపీల హల్‌చల్

అనుమతిచ్చి అరెస్టులు చేస్తే తాము ఉద్యమకారులకు ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని హితబోధ చేశారు. వెంటనే అరెస్టు చేసిన తెలంగాణవాదులను విడుదల చేయాలని కిరణ్ పైన నిప్పులు చెరిగారు. మరోవైపు అరెస్టులను నిరసిస్తూ.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు.
ఇది గమనించిన పోలీసులు ఎంపీల వాహనాలను కార్యాలయ సమీపంలో అడ్డుకున్నారు. వారిని లోనికి వెళ్లనివ్వలేదు. దీంతో ఎంపీలు లోనికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఎంపీలు కార్యాలయం ముందు రోడ్డు పైన బైఠాయించారు. కవాతుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని ఎంపి మందా జగన్నాథం అన్నారు.
మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బిజెపి కార్యకర్తలు, తెలంగాణవాదులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డు పైన బైఠాయించారు.












Click it and Unblock the Notifications