వైయస్ జగన్ వైపు నుంచే రావాలి: ముఖ్యమంత్రి

Kiran Kumar Reddy
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలంటే ఆ ప్రతిపాదన వైయస్ జగన్ వైపు నుంచి రావాల్సిందేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు వైయస్ జగన్‌ను సంప్రదించబోదని ఆయన స్పష్టం చేశారు. అయినా తాము జగన్‌కు చేరువ కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేతిలో తాము ఓటమి పాలైనప్పటికీ ఆ పార్టీకి తాము దగ్గర కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశాలున్నాయా, వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసులో విలీనమవుతుందా అని అడిగితే ఇది వైయస్ జగన్ వర్గాన్ని అడగాల్సిన ప్రశ్న అని ఆయన అన్నారు. తమతో చేరాలని కాంగ్రెసు ఎవరి కోసం కూడా ప్రయత్నాలు చేయబోదని, ఉన్నవారిని వదులుకోదని, కాంగ్రెసు పార్టీలో ఉండాలనుకున్నవారే ఉంటారని, అయినా విలీనంపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధిష్టానమేనని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి సానుభూతి పవనాల వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచిందని, జగన్ అరెస్టు కూడా ప్రభావం చూపించిందని, అందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచిందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా సానుభూతి పనిచేస్తుందా అని అడిగితే ఆ ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదని, కాంగ్రెసు కలిసికట్టుగా పనిచేస్తే విజయం తమదేనని ఆయన అన్నారు.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లో ఏది మీకు ప్రధాన ప్రత్యర్థి అని అడిగితే తమకు ప్రత్యర్థే లేదని, తామంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కొంత మంది నాయకులు వీడడం వల్ల పార్టీ బలహీనపడిందనే మాటలో వాస్తవం లేదని అన్నారు. తామేమీ ఆందోళన చెందడం లేదని ఆయన చెప్పారు. ఇష్టం లేనివారు పార్టీని వీడి వెళ్లడాన్ని తాము స్వాగతిస్తామని, ఈ విషయాన్ని తాను గతంలోనూ చెప్పానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు తమ ప్రభుత్వ పనితీరే వచ్చే ఎన్నికల్లో ప్రధానాంశంగా ఉంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+