తాగిన థాయ్ యువతిపై రేప్: దోషిగా తేలిన ఇండియన్

 Indian taxi driver found guilty of raping passenger
మెల్‌బోర్న్: తాగిన మత్తులో ఉన్న ఓ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో భారత దేశానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల ఓ ట్యాక్సీ డ్రైవర్దోషిగా తేలాడు. ఈ ఘటన గతేడాది జరిగింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సున్వీర్ జస్సార్ ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ది కొరియర్ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది ఏప్రిల్ 12వ తేదిన ఇతను ఓ విద్యార్థినిని తన ట్యాక్సీలో ఇంటికి తీసుకు వెళ్లే సమయంలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బ్రిస్బేన్ జిల్లా కోర్టులో నాలుగు గంటల పాటు ఈ కేసుకు సంబంధించి ఇరువైపుల వాదనలు వినిపించారు. థాయ్ దేశానికి చెందిన ఇరవై ఏడేళ్ల విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. వాదనల అనంతరం కోర్టు జస్సార్‌ను దోషిగా తేల్చింది. బాధితురాలిని తన ట్యాక్సీలో తీసుకు వెళుతున్న సమయంలో ఆమె ఇద్దరు స్నేహితురాళ్లు కూడా ట్యాక్సీ ఎక్కారు. వారిద్దరు స్టోరీ బ్రిడ్జ్ కింద ఉన్న కెప్టెన్ బర్క్ పార్క్‌కు ముందు దిగి పోయారు.

వారిద్దరి దిగి పోయిన తర్వాత జస్సార్ వెనుక సీట్లోకి వెళ్లి థాయ్ యువతిపై అత్యాచారం చేశాడు. కోర్టు బాధితురాలి వాదనలను, ఆమె స్నేహితురాళ్ల వాదనలను కూడా తీసుకుంది. వాదనల సందర్భంగా ప్రాసిక్యూటర్స్ తమ వాదనలను వినిపిస్తూ... బాధితురాలి ఇద్దరి స్నేహితురాళ్లు ఇద్దరు ట్యాక్సీని దిగిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని నిర్దేశిత మార్గంలో కాకుండా మరో మార్గానికి తీసుకు వెళ్లాడు. మత్తులో ఉన్న బాధితురాలు ఇది గమనించి తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఎటు వెళ్లాలో డ్రైవర్‌కి చెప్పమని ఫోన్‌లో కోరింది.

అడ్రస్ చెప్పినప్పటికీ జస్సార్ మాత్రం.. ట్యాక్సీని స్టోరీ బ్రిడ్జ్ వద్దకు తీసుకు వెళ్లి ఎవరూ లేని ప్రాంతంలో నిలిపాడు. ఆ తర్వాత వెనుక సీట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేసి అక్కడే బ్రిడ్జ్ కింద వదిలేసి వెళ్లాడని ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. బాధితురాలు ఎక్కడకు వెళ్లాలో జస్సార్‌కు తెలుసునని ఓ సాక్షి చెప్పారు. జస్సార్ చేసిన నేరానికి అతనికి ఆరేళ్ల జైలు శిక్ష పడాలని ప్రాసిక్యూటర్ వాదించారు. జడ్జ్ అతనికి శిక్ష విధించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+