హీనా-బిలావల్ రొమాన్స్‌లో కొత్త కోణం: రాళ్లతో కొట్టి..?
ఈ విషయాన్ని కూడా వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని బహిర్గతం చేసిన బ్లిడ్జ్ టాబ్లాయిడ్ తెలిపింది. బ్లిడ్జ్ తెలిపిన వివరాల ప్రకారం... షరియా చట్టం ప్రకారం హీనాను, బిలావల్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వారిద్దరి మధ్య ఎఫైర్ నిజమే అయితే ఇస్లామిక్ చట్టాల ప్రకారం వారు క్షమార్హులు కారని ఓ సంస్థకు చెందిన ప్రముఖులు అన్నారు. బిలావల్‌కు హీనాతో సంబంధాలు ఉన్నా, మత్తు పదార్థాలు సేవించినా అతనికి పార్టీ బాధ్యతలు గానీ, దేశ బాధ్యతలు గానీ తీసుకునేందుకు అనర్హుడని ఆ ప్రముఖుడు తెలిపారు.
పాకిస్తాన్‌లోని చట్టాలు వాటిని అంగీకరించవన్నారు. ఇస్లామిక్ న్యాయసూత్రాల ప్రకారం ఈ చర్య తీవ్రంగా ఖండించదగినదన్నారు. తప్పు చేసి ఉంటే బిలావల్ క్రిమినల్‌గా భావింపబడుతారని, అతను పిపిపి నేతగా ఉండేందుకు అనర్హుడు అని అన్నారు. కాగా పాకిస్తాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ తనయుడు, పిపిపి నేత బిలావల్ భుట్టోతో పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్కు అఫైర్ ఉందనే వార్తలు ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే.
ఈ వార్తలను హీనా రబ్బానీ ఖర్‌తో పాటు ఆమె భర్త కూడా ఖండించారు. అంతేకాదు ఈ విషయం బయటకు రాగానే హీనా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా కూడా వార్తలొచ్చాయి. హీనా, బిలావల్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ గ్రూపులు వారిద్దరికీ ఫత్వా జారీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలొచ్చాయి. పాకిస్తాన్ చట్టాల ప్రకారం అక్రమంగా ప్రేమ వ్యవహారం నడిపితే శిక్షార్హమేనని, కాబట్టి ఫత్వా జారీ చేయవచ్చునని బ్లిడ్జ్ రాసింది.