ఆపరేషన్ కోసం బెయిలివ్వండి, అసలుకే ఎసరు: శ్రీలక్ష్మి

సిబిఐ న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ.. దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ తరుణంలో ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని కోరారు. వెన్నునొప్పి చికిత్స చాలా కీలకమైందని, చాలా జాగ్రత్తగా చేయాలని, మానవ తప్పిదం జరిగితే అసలుకే ఎసరు వస్తుందని డిఫెన్స్ న్యాయవాది సురేంద్ర రావు కోర్టుకు చెప్పారు. వెన్నునాడులకు ఇబ్బంది లేకుండా చికిత్స చేయించే ఉద్దేశంతో ఫిజియోథెరపీపై సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు.
లేదంటే రోబోటిక్ పరిజ్ఞానంతో సర్జరీ చేయించాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. నిమ్స్(నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో అటువంటి పరిజ్ఞానం అందుబాటులో లేదని, కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో తీర్పును జడ్జి ఈ నెల 8వ తేదికి వాయిదా వేశారు.
కాగా శ్రీలక్ష్మి తీవ్ర అస్వస్థతతో కొంతకాలంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌లో ఆమెనే స్వయంగా ఆ విషయం చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్నానని ఆమె కోర్టుకు చెప్పుకున్నారు. 'నాకు వెన్నునొప్పి తీవ్రంగా ఉంది. వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకోసమైనా బెయిల్ మంజూరు చేయండి' అని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 24, 29వ తేదీల్లో నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్లినపుడు వెన్నునొప్పికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఓఎంసీ కేసులో తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.. బెయిల్ పిటిషన్‌పై 3న కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సిబిఐకి సూచించి, కేసు ను అదే రోజుకు వాయిదా వేశారు. తోడు లేకుండా నడవలేక పోతున్నానని శ్రీలక్ష్మి తన బెయిల్ పిటిషన్‌లో చెప్పుకున్నారు. అత్వసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారని, చికిత్స చేయకపోతే ఎడమ పాదం స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందని వారన్నారని ఆమె అన్నారు.
రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని కూడా వైద్యులు చెప్పినట్లు ఆమె తెలిపారు. కోర్టుకు ఆమె వైద్యులు ఇచ్చిన నివేదికలను కూడా సమర్పించారు. గత నెల 24, 27 తేదీల్లో శ్రీలక్ష్మిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించారు. ఆ తర్వాత నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో కూడా ఆమెకు పరీక్షలు చేశారు. ఆమెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. మానసికంగా కూడా శ్రీలక్ష్మి కుంగిపోయినట్లు చెబుతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications