కలర్ చేంజ్: నల్లటి చొక్కాతో డిఎంకె నేత కరుణానిధి

మెడపై పసుపు రంగు శాలువా ధరించేవారు. కానీ దాన్ని కూడా మార్చేశారు. పసురంగు శాలువా తెల్లటి శాలువా వచ్చింది. కొత్త గెటప్‌లో కనిపించిన కరుణానిధిని అందుకు గల కారణాన్ని అడిగారు. ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. డిఎంకె శుక్రవారం తలపెట్టిన నిరసనకు నల్లటి రంగు వస్త్రధారణను పోలీసులు నిషేధించారని ఆయన చెప్పారు. నిషేధాన్ని ఉల్లింఘించడానికే తాను నల్లటి చొక్కా ధరించినట్లు ఆయన తెలిపారు.
తమ అధినేతను చూసి కొంత డిఎంకె నాయకులు కూడా వెంటనే నల్లటి చొక్కాలను అప్పటికప్పుడు ధరించారు. గురువారం ఈ సంఘటన జరిగింది. అన్నాడియంకె ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి ఇక నుంచి నల్లటి దుస్తులు ధరిద్దామని కరుణానిధి పార్టీ పత్రిక మురసోలిలో పార్టీ కార్యకర్తలకు సూచించారు.
ఈ రోజు నుంచి తాను నల్లటి దుస్తులు ధరిస్తున్నానని, ఇక ముందు కూడా నల్లటి దుస్తులే ధరిస్తానని, ఇది అన్నాడియంకె ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడమని ఆయన అన్నారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో కరుణానిధి తన చొక్కా రంగు మార్చడం ఇదే ప్రథమం. కొన్ని సందర్భాల్లో మాత్రం తెల్లటి కుర్తా ధరించారు. పెరియార్ అనుచరులు కరుణానిధి చొక్కా రంగు మార్చుకోవడాన్ని హర్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications