కెఎస్ బ్రార్‌పై లండన్‌లో దాడి: నలుగురి అరెస్టు

బ్రార్ (78)పై ఆక్స్‌ఫర్డ్ సమీపంలోని క్యూబెక్ స్ట్రీట్‌లో నలుగురు వ్యక్తులు ఆదివారం రాత్రి దాడి చేశారు. బ్రార్‌ను హత్య చేయడానికి కుట్ర చేశారనే అనుమానంపై నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
ఆ నలుగురిని సెంట్రల్ లండన్ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. వోల్వర్‌హాంప్టన్‌లోని చిరునామాల్లో 33 ఏళ్ల పురుషుడిని, 40 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు వారు చెప్పారు. మరో 34 ఏళ్ల వ్యక్తిని కారులో వెళ్తుండగా వెస్టే బ్రోమ్‌విచ్‌లో అరెస్టు చేశారు. అదే స్థితిలో పాతికేళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
దాడి జరిగిన తర్వాత బ్రార్ మెడకు చికిత్స చేసి ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. తన భార్యతో పాటు ఆయన ఈ నెల 3వ తేదీ ముంబైకి తిరిగి వెళ్లారు. 1984 ఆపరేషన్ బ్లూ స్టార్‌లో తన పాత్ర వల్లనే తనను ఖలిస్తాన్ అనుకూల వర్గాలు హత్య చేయడానికి ప్రయత్నించాయని బ్రార్ అన్నారు.
వ్యక్తిగత పర్యటనలో భాగంగా బ్రార్ లండన్ వచ్చారు. తన భార్యతో కలిసి బస చేసిన హోటల్‌కు వెళ్తుండగా బ్రార్‌పై దాడి జరిగింది. దాడిలో భార్యకు ఏ విధమైన హానీ జరగలేదు. దాడి గురించి తెలిపినట్లు బ్రార్ వ్యక్తిగత పర్యటన గురించి తమకేమీ తెలియదని లండన్‌లో భారత హై కమీషన్ వర్గాలు చెప్పాయి.
జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలే నాయకత్వంలోని ఖలిస్తాన్ టెర్రరిస్టులను స్వర్ణదేవాలయం నుంచి ఏరి వేయడానికి 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. అత్యంత వివాదాస్పదమైన ఆపరేషన్ బ్లూ స్టార్ పథకాన్ని 1984లో ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఎఎస్ వైద్య రచించారు. జనరల్ వైద్యను 1986లో కాల్చి చంపారు.












Click it and Unblock the Notifications