• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హీనా రబ్బానీ ఖర్, బిలావల్ భుట్టో లవ్ అఫైర్ సీక్రెట్

By Srinivas
|

Bilawal Bhutto-Hina Rabbani Khar
ఇస్లామాబాద్: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, పిపిపి నేత బిలావల్ భుట్టోల మధ్య ప్రేమ వ్యవహారం ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు చెందిన బ్లిడ్జ్ టాబ్లాయిడ్ తొలుత ఈ సెన్షేషనల్ వార్తను వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ టాబ్లాయిడ్ హీనా, బిలావల్ ప్రేమ వ్యవహారంపై ఎన్నింటినో బయట పెట్టింది. అయితే వీరి మధ్య ఉన్న లవ్ ఎఫైర్ ఎక్కడి నుండి సేకరించారో మాత్రం బ్లిడ్జ్ తెలియజేయలేదు.

బిలావల్‌తో ఎఫైర్‌ను వెలుగులోకి తీసుకు వచ్చిన తర్వాత తాజాగా ఆమె జీవన విధానంపై విమర్శలు చేస్తోంది. హీనా, బిలావల్ మధ్య ఉన్న రొమాంటిక్ రిలేషన్‌షిప్ పైన ఆ టాబ్లాయిడ్ ఇటీవల ప్రచురించిన హైలైట్స్ కొన్ని...

హీనా పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన మిలియనీరైన వ్యాపారవేత్త ఫిరోజ్ గుల్జార్‌ను పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. పేర్లు అన్నయ, దిన. హీనా తన భర్త గుల్జార్ మరో అమ్మాయితో సంబంధాలు కలిగి ఉండటాన్ని గుర్తించింది. దీంతో హీనా తీవ్ర అసంతృప్తికి లోనైంది.

తన భర్తపై తీవ్ర అసంతృప్తితో ఉన్న హీనా డిప్రెషన్‌కు గురైంది. ఆ తర్వాత స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

హీనా క్రమంగా 24 ఏళ్ల బిలావల్ భుట్టోతో ప్రేమలో పడింది. ఇతను ఆమె కంటే 11 ఏళ్లు చిన్నవాడు. ఇది భార్యాభర్తల మధ్య పొరపొచ్చలు రావడానికి దారి తీసింది.

హీనా, బిలావల్ ఇద్దరు విదేశీయానం చేసిన సందర్భాలలో కలిసి జీవించారు. ప్రయివేటుగా, అధికారికంగా వారిద్దరూ కలిసే ఉన్నారు.

బిలావల్ తండ్రి, పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ.. హీనాను, బిలావల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. బిలావల్‌కు హీనా రాసిన లెటర్ జర్దారీ చేతికి చిక్కడంతో అతను వారిని పట్టుకోగలిగాడు. ఆ లెటర్‌లో.. మన బంధం శాశ్వతమైనదని, త్వరలో ఇద్దరం కలిసి జీవించాలని హీనా ఆ లెటర్‌లో రాసింది.

వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న జర్దారీ నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. జర్దారీ తన అధికారిక అధ్యక్ష భవనంలోనే వారికి హితవు పలికారు.

పెళ్లైన యువతితో అదీ ఇద్దరు పిల్లలు కలిగిన హీనాతో బిలావల్ సంబంధాలు బయటకు వస్తే తన తనయుడి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు అని జర్దారీ భావించారు.

జర్దారీ హీనాను, హీనా భర్తను విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా హీనా కుటుంబాన్ని పలు కుంభకోణాలల్లో ఇరికించి దెబ్బతీసే ప్రయత్నాలు చేశాడు. వ్యాపారాలకు చిక్కులు సృష్టించాడు.

అదే సమయంలో బిలావల్ హీనా కోసం పార్టీని కూడా వదిలేందుకు సిద్ధమయ్యాడు. ఇతను హీనా, ఆమె ఇద్దరు కూతుళ్లతో కల్సి స్విట్జర్లాండ్‌లో సెటిల్ అయ్యేందుకు సిద్ధమయ్యాడు.

ఆ తర్వాత బిలావల్.. హీనా తన ఇద్దరు కూతుళ్లను తన భర్త వద్దే వదిలేసి ఆతనికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమని తన తండ్రి జర్దారీకీ చెప్పాడు.

జర్దారీ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హీనాను దెబ్బతీసే ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా ఆమెను మంత్రివర్గం నుండి తొలగించేందుకు కూడా జర్దారీ సిద్ధమయ్యాడు.

బిలావల్, హీనాలు కాల్ లిస్టులను జర్దారీ సేకరించాడు.

హీనా, ఆమె భర్త ఇద్దరూ బిలావల్‌తో రొమాన్స్ వార్తలను ఖండించారు. ఇది రాజకీయ కుట్ర అని, హీనాను ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె భర్త గుల్జార్ ఆరోపించారు. అయితే ఇప్పటి వరకు బిలావల్ నుండి లేదా జర్దారీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఓ పిపిపి నేత మాత్రం ఈ ఆరోపణలు కుట్రగా అభివర్ణించారు. అమెరికాలో ఐఎస్ఐకి వ్యతిరేకంగా హీనా మాట్లాడారని అందుకే ఆమె ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

English summary
Alleged love affair between Pakistan Foreign Minister Hina Rabbani Khar and young Chairman of ruling Pakistan Peoples Party (PPP) Bilawal Bhutto has become the talk of the town. A Bangladeshi tabloid Blitz stormed the world, especially Pakistan, with its first sensational report on alleged high profile affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X