వైయస్ వివేకానంద బాసట: జగన్ పార్టీలోకి కృష్ణబాబు

జగన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చేస్తున్న హడావుడి అంతా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమేనన్నారు. జగన్ సంపాదనకు లెక్కలు పక్కాగా ఉన్నాయన్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కేసులు బనాయిస్తున్నారన్నారు.
తెలుగుదేశం సీనియర్ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం జైలులో జగన్మోహన్‌రెడ్డితో ములాఖత్ అయినట్టు సమాచారం. వీరిద్దరి మధ్య 20 నిమిషాలకు పైగానే సంభాషణ సాగింది.
కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక జరిగే సమయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాజమండ్రి ఎంపీ టికెట్ లేదా రాజ్యసభ టికెట్ ఇవ్వాలనే డిమాండ్లను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. అయితే, జగన్ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుకుండానే ఆయన వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications