తెరాస విలీనం సంగతి తెలియదు: ఆస్కార్ ఫెర్నాండెజ్

ఈ సందర్బంగా ఆస్కార్ ఫెర్నాండెజ్ మాట్లాడారు. కెసిఆర్ తనను కలిశారని, తెలంగాణపై కెసిఆర్ చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు తెలంగాణ అంశాన్ని తన దృష్టికి తెచ్చారని, వారి అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లడం తన బాధ్యత అని ఆయన అన్నారు.
తెలంగాణ గురించే మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం చేయాల్సింది, ప్రకటన చేయాల్సింది తమ పార్టీ అధిష్టానమేనని ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు ఎఐసిసి కోశాధికారి మోతిలాల్ వోరాను కూడా కలిశారు. తెలంగాణపై అధిష్టానానికి తమ అభిప్రాయాలను వినిపించడానికి డికె అరుణ నేతృత్వంలోని మహబూబ్‌నగర్ జిల్లా నేతలు ఢిల్లీకి వచ్చారు.
డికె అరుణ నేతృత్వంలో శానససభ్యులు ప్రతాప రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీలు జగదీశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు మంగళవారం ఆస్కార్ ఫెర్నాండెజ్‌ను కలిసినవారిలో ఉన్నారు. తెలంగాణ అంశంపై కెసిఆర్ ఆ మధ్య ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications