Data Centre Jobs: డేటా సెంటర్లతో వచ్చేది వెయ్యి ఉద్యోగాలేనా ? తేల్చేసిన ఏపీ సర్కార్..!

ఏపీలో గత ఏడాది కాలంగా కూటమి సర్కార్ డేటా సెంటర్ల (Data centres)పై భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అనంతరం రిలయన్స్ సహా మరికొన్ని సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చాయి. అయితే ఈ డేటా సెంటర్ల వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా భారీ ఎత్తున నీరు, విద్యుత్ ఖర్చు చేయాల్సి వస్తుందని, అయితే ఉద్యోగాలు (Jobs) మాత్రం వెయ్యి కంటే ఎక్కువగా రావనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సర్కార్ స్పందించింది.

రాష్ట్రంలో డేటా సెంటర్ల వల్ల కేవలం వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వస్తాయని తాజాగా 17వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న విశాఖలో కలకలం రేగింది. దీనిపై ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. డేటా సెంటర్ల వల్ల కేవలం వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్పినట్లు కూడా వక్రీకరించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.

Only 1 000 Jobs From Vizag Data Centres AP Government Says That s Not the Full Picture

17వ ఎస్ఐపీబీ సమావేశంలో చెప్పింది కేవలం కొత్తగా ప్రారంభించబోయే రిలయన్స్ డేటా సెంటర్ లో తొలి దశలో వచ్చే ఉద్యోగాల సంఖ్య మాత్రమేనని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కాబోయే అన్ని డేటా సెంటర్ల ద్వారా భారీగా ఉపాధి లభిస్తుందని నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. అలాగే నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ప్రభుత్వం హితవు పలికింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+