పిఠాపురం వర్మకు మెగా క్యాంప్ ఘాటు కౌంటర్..! డిఫెన్స్ లోకి కూటమి ?
గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం (pithapuram)నుంచి తొలిసారి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేసి మరీ సహకరించిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆ తర్వాత అవమానాలే మిగిలాయి. ముఖ్యంగా పిఠాపురాన్ని పవన్ కు కంచుకోటగా మార్చే క్రమంలో జనసేన అనుసరిస్తున్న వైఖరితో వర్మకు అవమానాలు తప్పట్లేదు. వర్మను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తామన్న హామీని కూటమి ఎప్పుడో పక్కనబెట్టేసింది. దీంతో అదే కూటమిని నడుపుతున్న టీడీపీ పేరు చెప్పి పవన్ ను వర్మ టార్గెట్ చేస్తున్నారు.
తాజాగా పిఠాపురం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు ఫొటోలు లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్మ గొడవకు దిగారు. దీంతో జనసేన నేతలు ఆయనకు ఘాటుగా కౌంటర్ కూడా ఇచ్చారు. ఓ దశలో వర్మపైకి దూసుకెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రగిలిపోయిన వర్మ లోకల్ కాని పవన్ కళ్యాణ్ కు తాను అన్ని విధాలా అండగా నిలిచి గెలిపించానని చెప్పుకొచ్చారు. దీనిపై మండిపడుతున్న మెగా క్యాంప్ ఎక్స్ లో ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చింది.

ఎవరు లోకల్?
— MegaFamilyFanForever (@JSPROYALSOLDIER) April 22, 2026
*************
లోకేశ్ ది మంగళగిరి కాదు...
బాలయ్యది హిందూపూర్ కాదు...
పురంధేశ్వరిది రాజమండ్రి కాదు...
CM రమేష్ ది అనకాపల్లి కాదు...
సుజనా చౌదరిది... విజయవాడ పశ్చిమ కాదు...
ఆఖరికి చంద్రబాబుది చంద్రగిరి...కుప్పం కాదు...
మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వలస వచ్చాడంటాడేంటి?…
లోకేశ్ ది మంగళగిరి కాదు, బాలయ్యది హిందూపూర్ కాదు, పురంధేశ్వరిది రాజమండ్రి కాదు, సీఎం రమేష్ ది అనకాపల్లి కాదు,
సుజనా చౌదరిది విజయవాడ పశ్చిమ కాదు, ఆఖరికి చంద్రబాబుది చంద్రగిరి...కుప్పం కాదు..మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వలస వచ్చాడంటాడేంటి? అంటూ వర్మకు షాకిచ్చింది. అయినా వర్మ పిఠాపురం MLA కాదు...MLC కాదు... ఏ ప్రోటోకాల్ తో పిఠాపురంలో పెత్తనం చెయ్యాలని మాటిమాటికి కెలుకుతున్నాడు? ఎవరి అండతో రెచ్చిపోతున్నాడు? అని ప్రశ్నించింది.

ఇదే మొదటిసారి కాదు కదా.... మౌనంగా భరించి భరించి తట్టుకోలేక ఎవరైనా స్పందిస్తే వాళ్ళు వైసీపీ కోవర్టులంట. పెండెం దొరబాబుపై కోవర్టు ముద్ర వేసే కుట్ర చేస్తున్నారని, వర్మను టీడీపీ నుండీ గెంటేస్తే వర్మ వైసీపీ కోవర్ట్ కింద లెక్క... ఒకవేళ టీడీపీ వర్మపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే వర్మ చేసే యాక్షన్ వెనుక బాబు, లోకేష్ లు ఉన్నారని భావించాల్సి వస్తుందని మెగా క్యాంప్ తెలిపింది. దీంతో వర్మ-మెగా క్యాంప్ తమ మాటల యుద్ధంతో కూటమిని డిఫెన్స్ లోకి నెడుతున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications