పవన్ కళ్యాణ్ హెల్త్ బులెటిన్: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో అధికారులతో పాలనాపరమైన సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వైద్యుల సూచన మేరకు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఎం.ఆర్.ఐ (MRI) సహా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, శస్త్రచికిత్స తప్పనిసరి అని నిర్ణయించి ఆపరేషన్ పూర్తి చేశారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ధైర్యం చెప్పారు. "కళ్యాణ్ బాబుకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తను సాధారణ స్థితికి రావడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. పవన్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ చిరంజీవి పేర్కొన్నారు. తమ్ముడి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వార్తతో అటు జనసైనికులు, ఇటు మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Pawan Kalyan Undergoes Successful Surgery Chiranjeevi Gives Key Health Update on AP Deputy CM s Condition

ప్రధాని మోదీ ఆరా.. దీర్ఘకాలిక జాగ్రత్తలు తప్పనిసరి!

పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. స్వయంగా ఫోన్ చేసి పవన్ ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, పవన్ కళ్యాణ్ వారం నుంచి పది రోజుల విశ్రాంతి తర్వాత మళ్ళీ విధుల్లో చేరవచ్చని వైద్యులు వెల్లడించినప్పటికీ, పూర్తి స్వస్థత చేకూరడానికి మరికొంత కాలం పడుతుందని స్పష్టం చేశారు. దీర్ఘకాలం పాటు కొన్ని కఠినమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించినట్లు సమాచారం.

అధికారిక కార్యకలాపాలకు విరామం..

సర్జరీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన పర్యటనలను, అధికారిక సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్ది నెలలుగా బిజీ షెడ్యూల్, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతుండటంతో, వచ్చే వారం చివరలో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశం ఉంది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సర్జరీపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు.. " పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో, మరింత శక్తివంతంగా త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను" అని పోస్ట్ చేశారు

జగన్ ఆకాంక్ష..

ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) స్పందించి ఓ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారూ.. మీరు శస్త్రచికిత్స తర్వాత వేగంగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ ఇవాళ ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ అంటూ తెలిపారు. తద్వారా రాజకీయంగా తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వ్యక్తిగత విషయాల్లో స్పందించేందుకు మాత్రం అవేవీ అడ్డంకులు కావని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లయింది. గతంలో జగన్ పుట్టిన రోజులకు చంద్రబాబు, పవన్, అలాగే వారి పుట్టినరోజులకు ఆయన శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+