హీరోని పెళ్లి చేసుకోను: శోభిత పాత వీడియో వైరల్

టాలీవుడ్ స్వీట్ కపుల్స్‌లో నాగచైతన్య-శోభితా దూళిపాళ్ల జంట ఒకటి. అయితే ప్రస్తుతం శోభితకు సంబంధించిన ఓ ఫోటో కారణంగా ఆమె ప్రెగ్నెంట్ అనే పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. శోభితకు సంబంధించిన 2018 నాటి పాత ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూడిన నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ కు దిగుతున్నారు.

ఆ పాత వీడియో క్లిప్ లో శోభిత తన రాజకీయ భావజాలాన్ని స్పష్టంగా వెల్లడించారు. తనకు బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయని.. తాను ఒక లెఫ్ట్-లిబరల్ భావజాలం ఉన్న వ్యక్తినని ఆమె పేర్కొన్నారు. ఏదో ఒక రోజు కమ్యూనిజం గెలుస్తుందని తాను నమ్ముతున్నట్లు ఆమె కామెంట్ చేశారు. ఆ పాత కామెంట్సే ఇప్పుడు ఆన్ లైన్ ట్రోలింగ్ కు కారణమయ్యాయి. శోభిత చేసిన కామెంట్లు వాస్తవ దూరంగా ఉన్నాయని.. కాలక్రమేణా ఆమె అభిప్రాయాలు తప్పని నిరూపణ అయిందని పలువురు నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. మరికొందరు ఆమె భావాలు చాలా ప్రమాదకరం అని అభివర్ణిస్తూ.. ఆ వీడియో క్లిప్ ను సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు.

Sobhita Dhulipala 2018 Viral Interview Sparks Online Trolling Says I Won t Marry an Actor Details

అయితే కేవలం రాజకీయం గురించిన మాత్రమే కాకుండా ఆ ఇంటర్వ్యూలో మరో కీలక అంశం నెటిజన్లు దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. తాను ఎప్పటికీ ఓ నటుడితో ప్రేమలో పడనని.. పెళ్లి చేసుకోనని ఆ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్ల చెప్పుకొచ్చారు. నటులలో సాధారణంగా అహంకారం, ఆడంబరాలు ఎక్కువగా ఉంటాయని.. అందుకే తోటి నటుడిని డేటింగ్ చేయడం తనకు ఇష్టం లేదని ఆ వీడియోలో శోభిత వివరించారు.

కానీ కొన్నేళ్ల తర్వాత శోభిత స్టార్ హీరో నాగచైతన్యను ప్రేమించి డిసెంబర్ 2024లో వివాహం చేసుకుంది. దీంతో నెటిజన్లు శోభిత పాత కామెంట్లను గుర్తుచేస్తూ.. మాటలకు చేతలకు పొంతన లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ విషయంపై శోభిత గతంలోనే స్పందిస్తూ.. సమయంతో పాటు మనుషుల ఆలోచనలు, అభిప్రాయాలు మారడం సహజమేనని.. తాను కూడా పాత అభిప్రాయాలను మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ నెటిజన్లు ఆమె పాత మాటలను ప్రస్తుత జీవితంతో పోలుస్తూ మీమ్స్ సృష్టిస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+