బంగారం ధరల్లో భారీ డౌన్ ఫాల్- ఆచితూచి వ్యవహరించక తప్పదు

దేశంలో నేడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలోపేతం కావడం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ త్వరలో తీసుకోబోయే కీలక వడ్డీ రేట్ల నిర్ణయాలు వీటిని ప్రభావితం చేశాయి. ఇక్కడ నెలకొన్న అనిశ్చితి, అస్థిరత కూడా ధరల తగ్గుదలకు కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీంతో కొనుగోలుదారులను ఆచితూచి వ్యవహరిస్తోన్నారు. బంగారం కొనే విషయంలో కొంత వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తోన్నారు.

అంతర్జాతీయ కామెక్స్ లో స్పాట్ లో బంగారం ధర 0.7 శాతం నష్టపోయింది. ఔన్సుకు 4,044.81 డాలర్ల వద్దకు పడిపోయింది. సోమవారం నాడు ఒక శాతం మేర లాభపడినప్పటికీ ఆ తర్వాత ఒత్తిడితో ధరల గ్రాఫ్ నేలకు దిగజారింది. అదే సమయంలో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.8 శాతం నష్టంతో 4,045.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ దాదాపు నెల రోజుల గరిష్ట స్థాయి వద్ద స్థిరంగా సాగుతుండటంతో ఇతర కరెన్సీలు కలిగిన ఇన్వెస్టర్లకు బంగారం కొనుగోళ్లు మరింత ఖరీదైనవిగా మారాయి.

Gold and Silver Falls at MCX in India as pressured by a stronger dollar and Federal Reserve s policy

దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ఆగస్ట్ కు సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్ట్ 0.62 శాతం తగ్గి 10 గ్రాములు రూ.1,42,178 వద్ద ట్రేడ్ అయింది. వెండి సెప్టెంబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏకంగా 1.37 శాతం నష్టపోయింది. కిలో 2,18,139 రూపాయలకు క్షీణించింది. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 1,690 రూపాయల దగ్గుదల నమోదైంది. 22 క్యారెట్లల్లో రూ. 1,550, 18 క్యారెట్లల్లో రూ. 1,260 మేర తగ్గింది.

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,418, 22 క్యారెట్లు - రూ. 13,216, 18 క్యారెట్లు - రూ. 11,030

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,417, 22 క్యారెట్లు- రూ. 13,215, 18 క్యారెట్లు - రూ. 10,813

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,417, 22 క్యారెట్లు- రూ. 13,215, 18 క్యారెట్లు - రూ. 10,813

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,417, 22 క్యారెట్లు- రూ. 13,215, 18 క్యారెట్లు - రూ. 10,813

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,417, 22 క్యారెట్లు- రూ. 13,215, 18 క్యారెట్లు - రూ. 10,813

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,417, 22 క్యారెట్లు- రూ. 13,215, 18 క్యారెట్లు - రూ. 10,813

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+