జైలునుండి శ్రీలక్ష్మి విడుదల: హ్యాపీ అన్న సోమశేఖర

Srilaxmi
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టై చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి విడుదలయింది. చికిత్స నిమిత్తం కోర్టు ఆమెకు సోమవారం తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం జైలు నుండి విడుదలయింది. ఆమె భర్త గోపీ కృష్ణ బెయిల్ పత్రాలను జైలు అధికారులకు అందించారు. శ్రీలక్ష్మికి భర్త, అత్త జామీను ఇచ్చారు.

కాగా శ్రీలక్ష్మికి సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స నిమిత్తం కోర్టు ఈ బెయిల్ మంజూరు జేసింది. సోమవారం నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఆమెకు బెయిల్ ఇచ్చింది. 20వ తేదీ తర్వాత ఆమె తిరిగి లొంగిపోవాల్సి ఉంటుంది. బెయిల్ ఇస్తూ శ్రీలక్ష్మికి షరతులు విధించింది. పాస్‌పోర్టును తమ ముందు పెట్టాలని, బెయిల్ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది.

వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స అవసరమని చెప్పడానికి ఆమె తరఫు న్యాయవాదులు వైద్య పరీక్షల నివేదికలను కోర్టుకు సమర్పించారు. శ్రీలక్ష్మి తీవ్రమైన మానసికవ్యధతో నలిగిపోతున్నారని, అందువల్ల జైలులో ఉంటూ శస్త్రచికిత్స చేయించుకుంటే శస్త్రచికిత్స ఫలితం ఉండకపోవచ్చునని, బెయిల్ ఇస్తే కాస్తా మానసికంగా ఊరట చెందుతుందని, దానివల్ల శస్త్రచికిత్స ఫలితం ఇస్తుందని వైద్యులు ఇచ్చిన వివరణను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి కేసులో శ్రీలక్ష్మి ఆరవ నిందితురాలు. ఈ కేసులో ఆమెను సిబిఐ అధికారులు నిరుడు నవంబర్ 28వ తేదీన అరెస్టు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె ఒక్క రోజు మాత్రమే జైలులో ఉన్నారు. ఆ తర్వాత హైకోర్టు సిబిఐ కోరిక మేరకు బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఆమె ఈ ఏడాది జనవరి 6వ తేదీన కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి ఆమె పలుమార్లు కింది నుంచి పైదాకా కోర్టుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ బెయిల్ పిటిషన్లు ఎప్పటికప్పుడు తోసివేతకు గురవుతూ వచ్చాయి.

గాలి బెయిల్ డీల్ కేసులో...

గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో కర్నాటక కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబుకు హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు సోమశేఖర రెడ్డికి న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ రోజు చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. ఆయన విడుదల సందర్భంగా భారీగా అభిమానులు, కార్యకర్తలకు తరలి వచ్చారు. దీంతో అక్కడ కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. జైలు నుండి విడుదల కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+