ఫేస్‌బుక్‌లో రాబర్ట్‌వాద్రా వివాదాస్పద వ్యాఖ్య, తొలగింపు

రాజకీయ నేత అవతారమెత్తిన అరవింద్ కేజ్రీవాల్ రాబర్ట్ వాద్రాను ఇప్పుడు చిక్కుల్లో పడేశాడు. అయితే వాద్రా పైన విమర్శలు ఇది తొలిసారి కాదు. విపక్షం పట్టించుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఓ ఆంగ్లపత్రిక వాద్రా - డీఎల్ఎఫ్ డీల్‌ను బయటపెట్టింది. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. మామూలుగా అయితే... కాంగ్రెస్‌పైకి దీనినో ప్రధానాస్త్రంగా ప్రయోగించాలి.
కానీ... కమలనాథులు కిమ్మనలేదు. రాబర్ట్ వాద్రా ఓ ప్రైవేటు వ్యక్తి అని, మన లక్ష్యం సోనియా గాంధీయే కానీ... ఆమె కుటుంబ సభ్యులు కాదని, వ్యక్తిగత దాడులు అటల్ బిహారీ వాజపేయికి కూడా నచ్చదని పార్టీలో చర్చకు వచ్చింది. ఆయపై వచ్చిన ఆరోణల పట్ల మనం ఎలా స్పందించాలి, ఎలా విరుచుకు పడాలి అనే అంశంపై బిజెపి పెద్దలు ఓ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చివరికి... చేతికి చిక్కిన అస్త్రాన్ని వాడకుండా వదిలేశారు. ఇప్పుడు మాత్రం వాద్రాపై గట్టిగానే విరుచుకుపడుతున్నారు.












Click it and Unblock the Notifications