హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు యాత్ర: వేషాలు మార్చేన్, ప్రజలతో కలిసేన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైటెక్ చంద్రబాబు నాయుడు ఊళ్ల బాట పట్టారు. తన ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిఇవో అనిపించుకున్నారు. ప్రభుత్వం వెసులుబాటు యంత్రాంగంగా మాత్రమే పనిచేయాలనే దాకా ఆయన దృక్పథం సాగింది. తొమ్మిదేళ్ల పాటు తిరుగులేని పాలన సాగించారు.

బాబు: వేషాలు మార్చెను, ప్రజలతో కలిసేన్

ఈ పది రోజుల్లోనూ చంద్రబాబు ప్రజల్లో కలిసిపోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులను ఎత్తుకుని ఏడ్పులు మానిపించారు. తల్లి చంకలో ఏడుస్తూ ఉన్న ఓ పాప చంద్రబాబు చేతుల్లోకి రాగానే కేరింతలు కొట్టింది.

 బాబు: వేషాలు మార్చెను, ప్రజలతో కలిసేన్

రైతు సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. రైతుగా మారిపోయి హలాలతో పొలాలు దున్నుతున్నారు. వారి కష్టసుఖాలేమిటో తెలుసుకుంటున్నారు. రైతులకు వరాల వర్షం కురిపిస్తున్నారు. తన పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలూ తీరుస్తానని చెబుతున్నారు.

బాబు: వేషాలు మార్చెను, ప్రజలతో కలిసేన్

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ప్రజలతో కలిసి భోజనాలు చేస్తున్నారు. వీధి పక్క హోటళ్లలో చాయ్‌లు చప్పరిస్తున్నారు.

బాబు: వేషాలు మార్చెను, ప్రజలతో కలిసేన్

ప్రజల పక్కన కూర్చుని వారితో ముచ్చటిస్తున్నారు. వారిలో ఒక్కడైపోయి వారితో మాట్లాడుతున్నారు. తాను వారికి అత్యంత ఆత్మీయుడిగా మారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.

బాబు: వేషాలు మార్చెను, ప్రజలతో కలిసేన్

భూమి తల్లి మట్టిపొరలను చంద్రబాబు ముద్దాడుతున్నారు. భూమి తల్లి మట్టిపొరలను చేతులతో తాకి, తన ప్రేమను చాటుకుంటున్నారు. ఆయన పది రోజుల పాదయాత్రలో పదనిసలు చాలానే ఉన్నాయి.

బాబు: వేషాలు మార్చెను, ప్రజలతో కలిసేన్

ఇప్పుడు చంద్రబాబు తన పంథాను మార్చుకున్నారు. హైటెక్ హంగులను పక్కన పెట్టేసి పాదయాత్రకు దిగారు.

వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల మాటల మంత్రాలు, పాదయాత్ర చంద్రబాబును అధికారానికి దూరం చేశాయి. సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి రెండో సారి కూడా చంద్రబాబుకు అధికారాన్ని దూరం చేశారు. ప్రజలకు మనం ఇచ్చేది కాదు, వారి మనసులు తెలుసుకుని వారికేం కావాలో మనం ఇవ్వాలనే సూత్రాన్ని ఆయన విస్మరించారు.

ఇప్పుడు చంద్రబాబు తన పంథాను మార్చుకున్నారు. హైటెక్ హంగులను పక్కన పెట్టేసి పాదయాత్రకు దిగారు. ప్రజల్లో కలిసిపోతున్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వాటిని అందించడానికి సిద్ధపడుతున్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర పది రోజులకు చేరుకుంది.

ఈ పది రోజుల్లోనూ చంద్రబాబు ప్రజల్లో కలిసిపోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులను ఎత్తుకుని ఏడ్పులు మానిపించారు. తల్లి చంకలో ఏడుస్తూ ఉన్న ఓ పాప చంద్రబాబు చేతుల్లోకి రాగానే కేరింతలు కొట్టింది.

రైతు సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. రైతుగా మారిపోయి హలాలతో పొలాలు దున్నుతున్నారు. వారి కష్టసుఖాలేమిటో తెలుసుకుంటున్నారు. రైతులకు వరాల వర్షం కురిపిస్తున్నారు. తన పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలూ తీరుస్తానని చెబుతున్నారు.

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ప్రజలతో కలిసి భోజనాలు చేస్తున్నారు. వీధి పక్క హోటళ్లలో చాయ్‌లు చప్పరిస్తున్నారు.

ప్రజల పక్కన కూర్చుని వారితో ముచ్చటిస్తున్నారు. వారిలో ఒక్కడైపోయి వారితో మాట్లాడుతున్నారు. తాను వారికి అత్యంత ఆత్మీయుడిగా మారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.

భూమి తల్లి మట్టిపొరలను చంద్రబాబు ముద్దాడుతున్నారు. భూమి తల్లి మట్టిపొరలను చేతులతో తాకి, తన ప్రేమను చాటుకుంటున్నారు. ఆయన పది రోజుల పాదయాత్రలో పదనిసలు చాలానే ఉన్నాయి.

English summary
Telugudesam president N Chandrababu Naidu has completed his 1o days padayatra. He is trying mingle with people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X