జగన్‌ను కల్సిన విజయమ్మ: షర్మిల టూర్‌పై సూచనలు

YS Jagan-YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ములాఖత్ సమయంలో ఆమె, పలువురు నేతలతో కలిసి జగన్‌ను కలిశారు.

పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ, షర్మిల పాదయాత్ర గురించి పార్టీ రాజకీయ వేదిక సమావేశంలో చర్చించి విడుదల చేయనున్న నేపథ్యంలో విజయమ్మ జగన్‌తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా షర్మిల పాదయాత్ర గురించిన వివరాలను ఆమె జగన్‌కు తెలిపారు.

ఆయన చేసిన మార్పులు, చేర్పులు విజయమ్మ ఈ రోజు జరగనున్న పార్టీ భేటీలో నేతలకు వివరించనున్నారు. షర్మిల యాత్ర పైన జగన్ తన తల్లి విజయమ్మకు పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ సీనియర్లు తయారు చేసిన రూట్ మ్యాప్‌కు జగన్ ఓకే చెప్పినట్లుగా సమాచారం.

కాగా షర్మిల పాదయాత్రకే పార్టీ వర్గాలు మొగ్గు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఈ నెల 18వ తేదిన ఇడుపులపాయ నుండి తన పాదయాత్రను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ యాత్ర మూడువేల కిలోమీటర్లు సాగనుంది. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి యాత్రను ముగించిన చోటనే షర్మిల తన పాదయాత్రనూ ముగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+