విఐపిల హల్‌చల్: జైల్లో నిమ్మగడ్డను కలిసిన నాగార్జున

Nagarjuna - Nimmagadda Prasad
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిశారు. గురువారం మధ్యాహ్నం ములాఖత్ సమయంలో నాగార్జున జైలుకు వెళ్లి నిమ్మగడ్డను కలిశారు. గతంలోనూ ఈ యువసామ్రాట్ నిమ్మగడ్డను ఒకటి రెండుసార్లు కలిశారు.

అక్కినేని నాగార్జున గత జూలైలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిసి షిర్డీ ప్రసాదాన్ని అందించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు మంచి జరగాలని కోరుకుంటూ నాగార్జున అప్పుడు ప్రసాదాన్ని అందించారు. ఇటీవలి కాలంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను నాగార్జున జైలులో కలవడం ఇది మూడోసారి. అంతకుముందు జూన్ 30వ తేదీన ఆయన జైలులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిశారు. కాగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్టులో ప్రముఖ సినీ నటుడు నాగార్జున పెట్టుబడులు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

జైలు వద్ద విఐపిల హడావుడి

గురువారం చంచల్‌గూడ జైలు వద్ద విఐపిల హడావుడి కనిపించింది. నాగార్జున వచ్చి నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలవగా అంతకుముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పలువురు నేతలతో కలిసి వచ్చి జైలులో ఉన్న జగన్‌ను కలిశారు. షర్మిల పాదయాత్రపై ఆమె చర్చించేందుకు వచ్చారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు తనయుడు జలగం వెంకట్రావు కూడా జగన్‌తో భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+